యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్నది. ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న లక్ష్య మూవీ నుండి ప్రతి శుక్రవారం ఓ అదిరిపోయే సర్ ప్రైజ్ ఉంటుంది అంటూ టీం ప్రకటించింది. లక్ష్య రిలీజ్ అయ్యేవరకు ప్రతి శుక్రవారం లక్ష్య నుండి ఏదో ఒక అప్ డేట్ ఉంటుంది అని చెప్పినట్టుగానే ఈ శుక్రవారం కూడా లక్ష్య నుండి సర్ ప్రైజ్ వచ్చేసింది. అది హీరోయిన్ కేతిక శర్మ తో కలిసి నాగ శౌర్య రొమాంటిక్ గా ఉన్న పోస్టర్ ని రివీల్ చేసింది టీం.
హీరోయిన్ కేతిక శర్మ నాగ శౌర్య నుదిటి మీద ముద్దు పెడుతున్న లక్ష్య పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగ శౌర్య - కేతిక శర్మ లవ్ సూన్ అంటూ టీం లక్ష్య మూవీపై అంచనాలు పెంచేసింది. జగపతి బాబు విలన్ గా నటిస్తున్న నాగ శౌర్య లక్ష్య మీద మంచి అంచనాలున్నాయి. ఇలా ఫ్రైడే సర్ ప్రైజ్ లు అంటూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నారు.