ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కరోనా వలన చాలామంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడి కోలుకున్నవారు ఉన్నారు.. కొంతమంది కరోనా కారణంగా చనిపోయిన వారు ఉన్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ మళ్ళీ సినిమా షూటింగ్స్ తో కళకళలాడుతుంది. అయితే ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు రాబోతున్న టైం లో టాలీవుడ్ లోని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఆయన ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడడం కలకలం సృష్టించింది. ఈ విషయాన్నీ పోసాని కృష్ణ మురళిని స్వయంగా మీడియాకి తెలియజేసారు.
నేను, నా ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడింది. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది.. నాకు సినిమా ఆఫర్లు ఇచ్చిన నిర్మాత, దర్శకులు నన్ను క్షమించండి. నా వల్ల సినిమా షూటింగ్స్ కి ఇబ్బంది జరిగితే నన్ను మన్నించాలి. నాకు కరోనా రావడం వల్ల రెండు సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి అని పోసాని తెలిపారు. నా హెల్త్ పై ఎలాంటి ఆందోళనను చెందవద్దు. నేను, నా ఫ్యామిలీత్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాం. మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలో షూటింగులో పాల్గొంటాను అంటూ పోసాని మీడియాకి ఇచ్చిన ప్రకటనలో తెలియజేసారు.