ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా వున్న ఎన్టీఆర్ - రామ్ చరణ్ షూటింగ్ బ్రేక్ టైం లో రాజమౌళి తో కలిసి ఫుట్ బాల్ కూడా ఆడేస్తున్నారు. ఇక తాజాగా కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ ఈరోజు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి తహసీల్దార్ ఆఫీస్ లో సందడి చేసాడు. ఒక ల్యాండ్ విషయంలో ఎన్టీఆర్ ఇలా శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఎన్టీఆర్ రాకతో అక్కడ శంకర్ పల్లి తహసీల్దార్ ఆఫీస్ మొత్తం సందడి సందడిగా మారిపోయింది.
ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసమని ఎన్టీఆర్ అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గోపాలపురం గ్రామ పరిధిలో ఆరున్నర ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంపై ఎన్టీఆర్ శంకర్ పల్లి రెవెన్యూ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ అని అక్కడ చూసిన శంకర్ పల్లి రెవిన్యూ అధికారులతో పాటుగా ఫాన్స్ కూడా ఎన్టీఆర్ తో ఫోటోలు దిగేందుకు ఎగబడిపోయారట.