Advertisementt

జైలులో ఉమా ప్రాణాలకు ముప్పు

Fri 30th Jul 2021 08:46 PM
tdp devineni uma,devineni uma,former minister uma,rajahmundry,central jail  జైలులో ఉమా ప్రాణాలకు ముప్పు
Devineni life threatened in Rajahmundry jail జైలులో ఉమా ప్రాణాలకు ముప్పు
Advertisement
Ads by CJ

రెండు రోజుల క్రితం అరెస్ట్ అయ్యి.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో పోలీస్ కష్టడీలో ఉన్న టీడీపీ నేత దేవినేని ఉమా ప్రాణాలకు ముప్పు ఉందని  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ ప్రాణానికి హాని తలపెట్టేందుకే రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాజారావును ఆకస్మిక బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. 

కొండపల్లి ఫారెస్ట్‌లో అక్రమ తవ్వకాలను ప్రశ్నించినందుకే ఉమపై వైసీపీ మూకలు దాడిచేశాయని ఆయన దుయ్యబట్టారు. ఉమపై కక్షతోనే తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. రాజకీయ ప్రత్యర్థులను జైళ్లలో హతమార్చిన చరిత్ర వైసీపీ పాలకులకు ఉందన్నారు. ఉమ ప్రాణాలకు ఎటువంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ఆకస్మిక బదిలీపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Devineni life threatened in Rajahmundry jail:

TDP Devineni Uma Shifted to Rajahmundry Central Jail

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ