కరోనా వలన అన్ని అతలాకుతలం అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ అయితే మరీను. డేట్స్ కి విడుదల కావాల్సిన సినిమాలు.. పోస్ట్ పోన్ ఎక్కడికక్కడ అవుతున్నాయి. మరోపక్క షూటింగ్స్ కూడా నిన్నటివరకు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో.. ఇప్పుడు విడుదల అవ్వాల్సిన సినిమాలన్నీ ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. మే లో రిలీజ్ కావల్సిన సినిమాలు దసరా, డిసెంబర్ అంటుంటే.. దసరా కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు సంక్రాంతి రేస్ కి వెళుతున్నాయి.
మహేష్ - పరశురామ్ సర్కారు వారి పాట సంక్రాంతి కే ఫిక్స్ అయితే.. పవన్ - రానా ఏకే రీమేక్ తో పాటుగా, ప్రభాస్ రాధే శ్యామ్ లు 2022 సంక్రాంతికే రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. మరో పక్క నారప్ప ప్రెస్ మీట్ లో వెంకటేష్ కూడా ఎఫ్ 3ని సంక్రాంతికే రిలీజ్ చెయ్యొచ్చనే హింట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక వచ్చే సంక్రాంతికి మరెన్ని సినిమాలు రేస్ లోకి రాబోతున్నాయో తెలియడం లేదు. ఒక్కొక్కరిగా సంక్రాంతి డేట్ ని ఫిక్స్ చేస్తూ ఎంతమంది అధికారిక ప్రకటనలు ఇస్తారో ఈసారి జస్ట్ వెయిట్ అండ్ సి.