శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో జైలు ఊచలు పెక్కబెడుతున్నారు. రాజ్ కుంద్రా జైలుకి వెళ్ళింది మొదలు.. ఆయన చుట్టూ కేసు మరింతగా బిగుసుకుంటుంది. పలువురు నటీమణులు రాజ్ కుంద్రాపై ఆరోపణలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఆ కేసు ఇంకా తేలకుండానే.. ఇప్పుడు బాలీవుడ్ లో మరో అస్లీల కేసు నమోదయ్యింది. నటి నందిత దత్తా పై ఈ కేసు నమోదయ్యింది. ఓ మోడల్ నందిత దత్తా పై తీవ్రమైన ఆరోపణలు చెయ్యడమే కాదు.. ముంబై పోలీస్ లకు ఫిర్యాదు కూడా చేసింది. తనని బలవంతంగా కెమెరా ముందు నించోబెట్టి న్యూడ్ వీడియోస్ తీసింది అంటూ ఆ మోడల్ నందిత దత్తా పై తీవ్రమైన ఆరోపణలు చెయ్యడంతో ముంబై పోలీస్ లు హుటాహుటిన నందిత దత్తా ని అదుపులోకి తీసుకున్నారు.
నందితా దత్తా తో పాటుగా ఆమె ఫొటోగ్రాఫర్ మైనిక్ ఘోష్ ఇద్దరూ కలిసి చాలామంది మోడల్స్‌తో బలవంతంగా ఓ స్టూడియోలో న్యూడ్ వీడియోలు చేసి.. వాటిని పోర్నోగ్రఫీ వెబ్ సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అటాక్ చేశారు. నందితా దత్తా, తనను బలిగంజ్ స్టూడియోకి తెచ్చి బలి చేసిందని ఆ మోడల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా నందిత దత్తా తో పాటుగా కెమెరా మ్యాన్ మరో ఇద్దరినీ పోలీస్ లు అరెస్ట్ చేసారు. రాజ్ కుంద్రా కేసు తీవ్రత ఉన్న టైం లో కూడా ఇలాంటి పనులు చేస్తున్న వారిని ఏం అనాలి.