Advertisementt

కియారా ని ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్

Sun 01st Aug 2021 09:30 PM
rc 15,ntr fans,ntr,tarak heroine,kiara advani,joins,ram charan - shankar combo movie  కియారా ని ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్
NTR fans trolling Kiara Advani కియారా ని ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్
Advertisement
Ads by CJ

ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కియారా అద్వానీ సౌత్ హీరో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తుంది. ఇక్కడ కియారా అద్వానీ పై ఎన్టీఆర్ చూపు కూడా ఉంది. ముందు నుండి అంటే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్30 చెయ్యాలనుకున్నప్పుడే ఎన్టీఆర్ కియారా అద్వానీ హీరోయిన్ అయితే బావుంటుంది అని త్రివిక్రమ్ ని అడగడం.. అప్పట్లో త్రివిక్రమ్ కియారా అద్వానీని సంప్రదించాడనే న్యూస్ కూడా వచ్చింది. 

కానీ తర్వాత ఎన్టీఆర్ 30 డైరెక్టర్ మారిపోయినా.. కొరటాలకి కియారా అద్వానీ కి మధ్యన ఉన్న అనుబంధంతో ఎన్టీఆర్ 30 కి ఫైనల్ గా కియారా అద్వానీని హీరోయిన్ అయితే ఫ్రెష్ జోడిగా.. సిల్వర్ స్క్రీన్ మీద బావుంటుంది అని ఎన్టీఆర్ ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. 

కానీ తర్వాత రామ్ చరణ్ - శంకర్ మూవీ లైన్ లోకి రావడం, ఆ మూవీ కోసం ముందే కియారా అద్వానిని హీరోయిన్ గా లాక్ చెయ్యడం.. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు. అయితే కియారా అద్వానీ ఎన్టీఆర్ కి డేట్స్ లేవని చెప్పి రామ్ చరణ్ కి కమిట్ అవడంపై ఎన్టీఆర్ ఫాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. కియారా కూడా ఎన్టీఆర్ తో చేసే ఛాన్స్ ఉన్నా.. ఆమెకి శంకర్ దర్శకత్వంలో మూవీ చెయ్యాలనే కోరిక ఉండడంతోనే చరణ్ మూవీకి ఓకె చెప్పేసింది అని అంటున్నారు. రామ్ చరణ్ తో ఫ్రెండ్ షిప్ ఉంది. సో అలా కియారా ఆ మూవీకి ఓకె చెప్పడంతో ఎన్టీఆర్ ఫాన్స్ కియారా మీద పడ్డారు. కియారా ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

NTR fans trolling Kiara Advani:

RC 15: Kiara Advani Joins Ram Charan - Shankar 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ