నాగార్జున కలల ప్రాజెక్ట్, సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ బంగ్గార్రాజు కి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన సక్సెస్ తర్వాత బంగార్రాజు మూవీపై ఆశలు పెట్టుకున్న నాగార్జున.. చాలా రోజుల తర్వాత ఈ ప్రాజెక్ట్ ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో పట్టాలెక్కించాడానికి రెడీ అయ్యారు. అయితే బంగార్రాజు కి ఈ నెల 20 న సినిమా కి ముహూర్తం కుదిరింది అని, ఈ సినిమాలో నాగ చైతన్య ఓ కీ రోల్ పోషిస్తుండగా.. చైతు కి జోడిగా ఉప్పెన బ్యూటీ నటించబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఎపుడో స్క్రిప్ట్ పనులు పూర్తయినా.. నాగార్జున ఆచి తూచి ఈ సినిమాని పట్టాలెక్కిస్తున్నారని.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవడంతో కళ్యాణ్ కృష్ణ ఆఘమేఘాల మీద ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి అచ్చొచ్చిన సంక్రాంతి కి రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారట. ఈ సినిమాకోసం హైదరాబాద్ లోని ఓ భారీ సెట్ సిద్దమవుతుంది అని, ముందుగా నాగార్జున - రమ్యకృష్ణ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా టాక్.