కరోనా లాక్ డౌన్ తో 2022 సంక్రాంతి ఫ్లోటింగ్ పెరిగిపోతుంది. దసరాకి విడుదల కావాల్సిన సినిమాలన్నీ సంక్రాంతి కి లైన్ కడుతున్నాయి. ఇక మహేష్ ముందే సర్కారు వారి పాట షూటింగ్ మొదలైనప్పుడే సంక్రాంతి రిలీజ్ అంటూ అనౌన్స్ చెయ్యడమే కాదు.. ఇప్పటికి అదే మాట మీదున్నారు. ఇక జులై 30 న రావాల్సిన ప్రభాస్ కూడా సంక్రాంతికే అంటూ రిలీజ్ డేట్ ఇచ్చేసాడు. దానితో ప్రభాస్- మహేష్ ఫైట్ షురూ అయ్యింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ కూడా సంక్రాంతికే రిలీజ్ అంటూ జనవరి 12 న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.
ఇక ఆగష్టు, సెప్టెంబర్ లో అక్టోబర్ లో రిలీజ్ డేట్స్ ఇచ్చిన సినిమాలు చాలా వరకు వచ్చే ఏడాదికే షిఫ్ట్ అయ్యేలా ఉన్నాయి. అందులోనూ అందరూ సంక్రాంతి కే అంటున్నారు. మరి ప్రస్తుతం పవన్ - ప్రభాస్ - మహేష్ సంక్రాంతికి బరిలో దిగుతున్న కోడిపుంజులుగా ఫిక్స్ అయ్యారు. ఇక కొన్ని రోజులుగా ఆగితే ఇంకెంతమంది ఈ సంక్రాంతి బరిలోకి దిగేలా ప్లాన్ చేస్తారో అనే ఆత్రంలో ప్రేక్షకులు ఉన్నారు. అయితే భారీ బడ్జెట్ మూవీస్ అయిన మూడు సినిమాలు ఉన్నాయి. ఇక మిగతావి కామ్ అవడం తప్ప.. పోటీకి వెళ్ళవనే అంటున్నారు కొందరు. చూడాలి ఆ టైం కి మరెన్ని సంక్రాంతి రిలీజ్ అంటూ రెడీ అవుతాయో అనేది.