పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి హీరోగా ఎంటర్ అయిన సినిమాతోనే తన టాలెంట్ ని ప్రేక్షకులకి పరిచయం చేసాడు. మార్షల్ ఆర్ట్స్ తో పవన్ కళ్యాణ్ బోడి ని స్ప్రింగ్ లా తిప్పడమే కాదు.. కరాటే ఇలా పవన్ లోని ప్రత్యేకతని చూపించాయి. ఆయన నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ లోని స్పెషల్ క్వాలిటీస్ కి ఫాన్స్ , ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మించిన కొడుకుగా ఆయన కొడుకు అకీరా కనిపిస్తున్నాడు. ఎప్పటినుండో పవన్ వారసుడు అకీరా సినిమా రంగ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
కానీ పవన్ మాత్రం కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై ఎప్పుడు మాట్లడలేదు. కానీ అకీరా నందన్ మాత్రం హీరోగా ట్రై చెయ్యడనికి ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది వ్యవహారం. అందుకే మొన్న మ్యూజిక్ నేర్చుకుంటూ ఫాన్స్ ని సర్ప్రైజ్ చేసిన పవన్ కొడుకు అకీరా.. నేడు తండ్రి లా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అకిరా కర్రసాము చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అకీరా అలా కర్రసాము చేస్తూ కనబడగానే అందరూ తండ్రికి తగ్గ తనయుడు పవన్ లాగే అకీరా కూడా మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిపోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇవన్నీ అకీరా సినిమా ఎంట్రీ కోసమే అంటున్నారు నెటిజెన్స్.