Advertisementt

రాజ్ కుంద్రా vs ముంబై పోలీస్

Tue 03rd Aug 2021 07:35 PM
raj kundra,challenges,arrest,mumbai police,mumbai court  రాజ్ కుంద్రా vs ముంబై పోలీస్
Raj Kundra vs Mumbai Police రాజ్ కుంద్రా vs ముంబై పోలీస్
Advertisement
Ads by CJ

ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా ని ముంబై పోలీస్ లు రెస్ట్ చేసి రిమండ్ కి తరలించిన విషయం తెలిసిందే. అస్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా పోలీస్ కష్టడీలో ఉన్నాడు. అయితే రాజ్ కుంద్రా కేసు కోర్టులో నడుస్తుంది. రాజ్ కుంద్రా కి ముందస్తు నోటీసు లు ఇచ్చి అసలు విచారణకు పిలవకుండా తనని పోలీస్ లు డైరెక్ట్ గా అరెస్ట్ చేశారంటూ రాజ్ కుంద్రా లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. రాజ్ కుంద్రా తరుపు న్యాయవాది.. అక్రమంగా రాజ్ కుంద్రాని పోలీస్ లు అరెస్ట్ చేసారంటూ వాదించగా.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ లు మాత్రం.. రాజ్ కుంద్రా ఈ కేసులో సాక్ష్యాలు తయారు మారు చేస్తునందుకే అరెస్ట్ చెయ్యాల్సి వచ్చింది అంటూ తమ వాదనలు వినిపించారు. 

రాక్ కుంద్రా తన ఐ ఫోన్ లోని ఐ క్లౌడ్ ని తొలగించారని, కుంద్రా అరెస్ట్ సమయంలో ఆయన లాప్ టాప్ నుండి 61 అశ్లీల వీడియోలు, ఓ పోర్న్‌ సినిమా స్క్రిప్టుతోపాటు డిజిటల్‌ స్టోరేజ్‌లో మరో 51 వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీస్ లు కోర్టుకి తెలియజేసారు. కుంద్రా డిలేట్ చేసిన ఈమెయిల్స్ అన్ని రికవరీ చెయ్యగా.. అందులో రాజ్ కుంద్రా మోసాలు బట్టబయలు అయ్యాయని వారు కోర్టుకి చెప్పారు. దానితో రాజ్ కుంద్రా న్యాయవాది కూడా.. రాజ్ కుంద్రా అరెస్ట్ అప్పుడే ఫోన్, ల్యాప్ టాప్, రెండు హార్డ్‌ డిస్కులు పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. అందులో నుండి రాజ్ కుంద్రా డేటా ని ఎలా డిలేట్ చేస్తారంటూ లాయర్ పోలీస్ లని ప్రశ్నిస్తున్నారు. రాజ్ కుంద్రా ఆఫీస్ సోదాలు నిర్వహిస్తున్నప్పుడే కుంద్రా తన వాట్సప్‌ చాట్ ని తొలగించడం మొదలుపెట్టారని, అది సాక్ష్యాలను ధ్వంసం చేయడమేనని పోలీసులు వాదిస్తున్నారు. 

Raj Kundra vs Mumbai Police :

Raj Kundra challenges arrest by Mumbai Police

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ