ప్రభాస్ - నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె వరల్డ్ వైడ్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తో పాన్ వరల్డ్ మూవీ కి రంగం సిద్ధం చేస్తున్నాడు నాగ్ అశ్విన్. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ కె లో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్.. కీలక పాత్రలో కనిపిస్తుంటే.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రభాస్ కి జోడిగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో దీపికానే కాకుండా మరో హీరోయిన్ ఉంటుంది అని, అది సమంత అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా సమంత ప్రాజెక్ట్ కె లో డీ గ్లామర్ గా కనిపించబోతుంది అంటూ ప్రచారం కూడా మొదలయ్యింది.
ఇక తాజాగా ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ ఓ మల్టీస్టారర్ గా ఉండబోతుంది అని, ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు కనిపించబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ఇద్దరు హీరోలు జస్ట్ ఒకటి రెండు సీన్స్ కె పరిమితమవుతారని, అందులోను అమితాబ్ తో వారి సీన్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. ఇక ఈ రెండు హీరోల పాత్రలకు పేరున్న హీరోలని తీసుకోవాలని నాగ్ అశ్విన్ డిసైడ్ అయ్యారట. ఒకటి రెండు సీన్స్ చేసేందుకు బడా హీరోలు ముందుకు రాకపోయినా.. అమితాబ్ కాంబోలో సీన్స్ కాబట్టి చేసే అవకాశం ఉంది అంటున్నారు. మరి పాన్ వరల్డ్ మూవీ కాబట్టి.. ఇతర భాషల హీరోలను నాగ్ అశ్విన్ పట్టుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు.