సహజ నటిగా.. పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకుపోతున్న కేరళ బ్యూటీ సాయి పల్లవి.. కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. అలాగే పాత్రకు ఉన్న ప్రాధాన్యతను బట్టే.. సాయి పల్లవి సినిమాలు ఒప్పుకుంటూ వస్తుంది. తెలుగులో సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉంటే.. ఆమె నటించిన మరో చిత్రం శ్యామ్ సింగరాయ్ షూటింగ్ కూడా ఈమధ్యనే పూర్తయ్యింది. ఇక సాయి పల్లవి సైన్ చేసిన మరో తెలుగు సినిమా లేదు. అలాగే తమిళనాట తన సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది.
ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబో లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కోసం సాయి పల్లవి పేరుని పరిశీలిస్తున్నారనే అంటున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి ఫ్రీ గా ఉన్న హీరోయిన్. సో మీడియం హీరోస్ అంతా సాయి పల్లవి ని ట్రై చేసుకోవచ్చు. ప్రస్తుతం హీరోయిన్స్ కొరత ఉన్న టైం లో ఇలా సాయి పల్లవి డేట్స్ దొరకడం మాములు విషయం కాదు. ప్రస్తుతం తెలుగులో పూజ హెగ్డే, రశ్మిక్ అటు పాన్ ఫిలిమ్స్ తోనూ దూసుకుపోతున్నారు. మరి ఇప్పుడు యంగ్ హీరోస్ సినిమా మొదలెట్టినా.. ముందుగా సాయి పల్లవిని సంప్రదిస్తే.. ఆ సినిమాకి ఆటోమేటిక్ గా క్రేజ్ వచ్చేస్తుంది. ఇక సాయి పల్లవి ఓ పాన్ ఇండియా మూవీలో నటించబోతుంది అనే న్యూస్ కూడా ఉంది.