Advertisementt

దెబ్బకి దిగొచ్చింది

Wed 04th Aug 2021 05:27 PM
monal gajjar,special song,nagarjuna,bigg boss fame,bangarraju movie,bangarraju movie item song  దెబ్బకి దిగొచ్చింది
Big boss beauty Monal Gajjar in Bangarraju దెబ్బకి దిగొచ్చింది
Advertisement
Ads by CJ

హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేక ఇంటికెళ్ళిపోయి కామ్ గా ఉన్న మోనాల్ గజ్జర్ మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 4 తో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేసింది. బిగ్ బాస్ లోనే చిట్టి పొట్టి గ్లామర్ డ్రెస్సులతో అదరగొట్టేసింది మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక బోలేడన్ని ఆఫర్స్ చుట్టుముట్టాయి. అందులో బెల్లకొండ శ్రీనివాస్ మూవీలో స్పెషల్ సాంగ్, అలాగే స్టార్ మా డాన్స్ పూల్స్ షో తో పాటుగా .. మరికొన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయట. కానీ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ తో తెగ క్రేజ్ వచ్చేసింది అని పారితోషకం విషయంలో దర్శకనిర్మాతలను హడల్ కొట్టేసిందట. అందుకే మోనాల్ కి క్రేజ్ ఉన్నా.. ఆఫర్స్ లేకపోవడానికి కారణమంటున్నారు. 

ఆఖరికి షాప్ ఓపెనింగ్స్ విషయంలోనూ మోనాల్ ఎక్కడా తగ్గలేదట.. దానికి తగ్గట్టుగానే డిమాండ్ చేసిందట. తనకొచ్చే ఆఫర్స్ చూసుకుని మోనాల్ హైదరాబాద్ లో ఓ ఇల్లు కూడా కొనేసుకుంది. కానీ మోనాల్ పారితోషకం చూసిన నిర్మాతలు మోనాల్ ని పట్టించుకోవడం మానేశారట. దానితో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునే మోనాల్ గజ్జర్ కి తన అప్ కమింగ్ మూవీ బంగార్రాజు లో ఓ అవకాశం ఇచ్చారట. స్పెషల్ సాంగ్ లో ఆడేందుకు మోనాల్ ఒప్పేసుకుంది. అయితే ఇక్కడ పారితోషకం విషయంలో మోనాల్ ఎలాంటి డిమాండ్ చేయలేదట. అంటే పాప కి బాగా బుద్దొచ్చింది... అందుకే ఇలా అంటున్నారు నెటిజెన్స్.  

Big boss beauty Monal Gajjar in Bangarraju :

Monal Gajjar special in Bangarraju 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ