Advertisementt

బిగ్ బాస్ సీజన్ 5 లీకులు షురూ

Wed 04th Aug 2021 06:35 PM
bigg boss telugu,bigg boss telugu season 5, bigg boss telugu season 5 upade  బిగ్ బాస్ సీజన్ 5 లీకులు షురూ
Bigg Boss Season 5 Leaks Start బిగ్ బాస్ సీజన్ 5 లీకులు షురూ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కి సంబందించిన రహస్యాలను ఎంత జాగ్రత్తగా ఉంచినా.. బిగ్ బాస్ లీకులు మాత్రం యాజమాన్యాన్ని ఒణికిస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తో పూణే దగ్గర వేసిన బిగ్ బాస్ సెట్ నుండి మాత్రమే ఈ లీకులు బయటకి రాలేదు కానీ.. హైదరాబాద్ నడిబొడ్డున అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన బిగ్ బాస్ సెట్ నుండి ప్రతి సీజన్ గుట్టు బయటికి వస్తూనే ఉంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దగ్గరనుండి, ఎలిమినేట్ అయ్యే సభ్యులవరకు. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ దగ్గర నుండి ఇలా ఏ ఒక్క విషయాన్ని బిగ్ బాస్ దాచలేకపోతోంది. ఎంతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. బిగ్ బాస్ లీకులకు చెక్ పెట్టలేకపోతుంది.  

తాజాగా బిగ్ బాస్ 5 లీకులు కూడా షురూ అయ్యాయంటున్నారు. అసలు ఇంకా బిగ్ బాస్ మొదలు కాకముందే.. హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వర్షిణి, నవ్య స్వామి, సిరి, షణ్ముఖ్, శ్రీహాన్, గీతా సింగ్ అంటూ కొన్ని పేర్లు బయటికి వచ్చెయ్యగా.. ఇప్పడు బిగ్ బాస్ నుండి మరో లీకు బయటికి వచ్చింది. అదేమిటంటే స్టార్ మా బిగ్ బాస్ త్వరలోనే అంటూ ప్రోమో వదిలింది. ఆ తర్వాత హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ప్రోమో షూట్ మొదలు పెట్టిందట స్టార్ మా. 

హౌస్ లోకి 18 మంది ఎంటర్ అవ్వబోతున్నారని.. వారిలో కొంతమందిని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ప్రోమో షూట్ చేస్తుంటే.. మరికొంతమందికి తమకిష్టమైన ప్లేసెస్ లో ప్రోమో షూట్ చేస్తున్నారట. మారా ప్రోమో షూట్స్ ని బిగ్ బాస్ స్టేజ్ మీద ప్లే చేసి ఆయా కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపుతారనే విషయం తెలిసిందే. సో బిగ్ బాస్ లీకులు ఎప్పటిలాగే ఈసారి షురూ అయ్యాయన్నమాట. 

Bigg Boss Season 5 Leaks Start:

 Bigg Boss Telugu Season 5 upade 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ