సర్కారు వారి పాట మొదలు పెట్టింది మొదలు మహేష్ ఫాన్స్ సర్కారు వారి పాట అప్ డేట్స్ గురించి, ఆ సినిమా లుక్ కోసం తెగ ఎదురు చూసారు. అయితే జులై 31 నుండే సర్కారు వారి పాట ఫస్ట్ నోటీసు అంటూ మహేష్ ఫాన్స్ లో క్యూరియాసిటీ కలిగించేలా సర్కారు వారి పాట టీం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆగష్టు 9 మహేష్ బర్త్ డే వరకు సర్కారు వారి పాట ఫీస్ట్ కొనసాగుతుంది అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఆగష్టు 9 మహేష్ బర్త్ డే స్పెషల్ గా సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్ అంటూ ఫాన్స్ ని సర్ప్రైజ్ చెయ్యబోతున్నారు.
అయితే సర్కారు వారి పాట నుండి వదలబోయే సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్ టీజర్ హైలెట్స్ అంటూ కొన్ని న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్ అంటే టీజరే అని అంటున్నారు. అంతేకాకుండా సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్ లో మహేష్ బాబు లుక్స్ మాత్రమే కాదు, మహేష్ చెప్పే ఓ డైలాగ్ కూడా అదిరిపోతుందట. అలాగే ఈ టీజర్ ని ఓ నిమిషం నిడివి ఉండేలా కట్ చేశారట. అంతే కాకుండా సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్ లో థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలవబోతుందట. మరి ఇన్ని విన్న మహేష్ ఫాన్స్ ఆగుతారా? ఎప్పుడెప్పుడు మహేష్ సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్ రిలీజ్ అవుతుందా అని కాచుకుని కూర్చున్నారు.