Advertisementt

సూర్య జై భీం ఓటిటి రిలీజ్ కన్ ఫర్మ్

Thu 05th Aug 2021 11:54 AM
suriya,jai bhim movie,kollywood hero surya,jai bhim direct ott release,amazon prime  సూర్య జై భీం ఓటిటి రిలీజ్ కన్ ఫర్మ్
Suriya Jai Bhim for Direct OTT release సూర్య జై భీం ఓటిటి రిలీజ్ కన్ ఫర్మ్
Advertisement
Ads by CJ

గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ లో కోలీవుడ్ సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అనగానే.. తమిళంలో థియేటర్స్ యాజమాన్యాలు సూర్య పై విరుచుకుపడ్డాయి. అయినప్పటికీ.. నిర్మాతగా తనకి లాస్ వస్తుంది అని సూర్య డేర్ చేసి ఆకాశం నీ హద్దురా మూవీ ని అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ చేసాడు. భార్య జ్యోతిక నటించిన సినిమాలను డైరెక్ట్ ఓటిటి కి ఇచ్చేసి అందరికి షాకిచ్చాడు. సూర్య సినిమాలను తమిళనాడు థియేటర్స్ లో రిలీజ్ కానివ్వమని థియేటర్స్ యాజమాన్యాలు నానా యాగీ చేసాయి. కానీ సూర్య మాత్రం తాను అనుకున్నదే చేసాడు. 

తాజాగా సూర్య నిర్మాణంలో ఆయన హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాని సూర్య ఓటిటికి అమ్మేశాడు. అది కూడా జై భీం అంటూ రీసెంట్ గానే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకున్న సినిమాని అమెజాన్ ప్రైమ్ నుండి నవంబర్ లో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. అలాగే భార్య జ్యోతిక నటించిన చిత్రాన్ని కూడా అక్టోబర్ లోనే అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా సూర్య ప్రకటించాడు. సో సూర్య జై భీం నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ ఓటిటి నుండి రిలీజ్ కాబోతుంది. 

Suriya Jai Bhim for Direct OTT release:

Suriya Jai Bhim for Direct OTT release via Amazon Prime

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ