హీరో నాని రీసెంట్ మూవీ టక్ జగదీశ్ ఏప్రిల్ లో విడుదల కావాల్సింది.. కరోనా తో పోస్ట్ పోన్ అయ్యింది. అప్పటి నుండి టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్ అంటూ వార్తలు వచ్చిన వెంటనే మేకర్స్ హడావిడిగా సోషల్ మీడియాలో మా సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అంటూ టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్ వార్తలను ఖండించేవారు. అయితే ఈ రోజు ఉదయం నుండి టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్ కంఫర్మ్ అంటూ వార్తలొస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వారు టక్ జగదీశ్ కి 45 కోట్ల డీల్ తో చేజిక్కించుకుంది అని అంటున్నారు.
మేకర్స్ కూడా ప్రస్తుతం కరోనా వలన థియేటర్స్ లో జనాలు కనిపించడం లేదు. థర్డ్ వేవ్ అంటున్నారు. అందుకే టక్ జగదీశ్ నిర్మాతలు ఓటిటి కి జై కొట్టారు.. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ నుండి నాని టక్ జగదీష్ రిలీజ్ అంటూ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, టక్ జగదీశ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం చూస్తున్నాం. కానీ ఇంతవరకు మేకర్స్ తమ సినిమా విషయంపై స్పందించడం లేదు. థియేటర్స్ రిలీజ్ మాత్రమే అంటూ క్లారిటీ ఇవ్వకుండా ఉండేసరికి అందరూ నాని టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్ అంటూ ఫిక్స్ అయ్యిపోతున్నారు.