Advertisementt

పుష్ప కన్నా ముందే కెజిఎఫ్

Fri 06th Aug 2021 09:37 AM
yash kgf chapter 2,allu arjun pushpa,kgf,pushpa movie,kgf and pushpa movie  పుష్ప కన్నా ముందే కెజిఎఫ్
KGF before Pushpa Movie పుష్ప కన్నా ముందే కెజిఎఫ్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజీ మూవీ గా తెరకెక్కుతున్న పుష్ప సినిమా ఆగష్టు 13 న రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇప్పుడు కరోనా కారణంగా ఈ సినిమా డిసెంబర్ క్రిష్ట్మస్ కి షిఫ్ట్ అయ్యింది. అధికారికంగా టీం క్రిష్ట్మస్ కి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా పోస్టర్ తో సహా ప్రకటించింది. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా క్రిస్టమస్ రిలీజ్ అంటూ వార్తలోస్తున్నాయి. ప్రశాంత్ నీల్ - యష్ కాంబో లో తెరకెక్కిన కెజిఎఫ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే జులై 16 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కూడా సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడింది. 

మళ్ళీ ఎప్పుడు రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారో అంటూ ఫాన్స్ మాత్రమేనా.. పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈమధ్యన కెజిఎఫ్ క్రిస్టమస్ రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ మేకర్స్ ప్రకటన ఇవ్వడం లేదు. ఇక తాజాగా పాన్ ఇండియా మూవీ పుష్ప కన్నా ఓ వారం ముందే కెజిఎఫ్ ని రిలీజ్ చేసేందుకు చూస్తున్నారట. అంటే డిసెంబర్ 20 న కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. 

KGF before Pushpa Movie:

Yash KGF Chapter 2 To Clash With Allu Arjun Pushpa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ