ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిన తమన్నా ఇప్పటికి ఫుల్ స్వింగ్ లోనే ఉంది. కాజల్, సమంతలు పెళ్లిళ్లు చేసుకుని సినిమాలు చేస్తున్నారు. కానీ తమన్నా ఆ దిశగా ఆలోచించడం లేదు. వెబ్ సీరీస్, సినిమాలు అంటూ జోరు లో ఉన్న తమన్నా నటించిన టాలీవుడ్ మూవీస్ సీటిమార్, మ్యాస్ట్రో చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అలాగే ఓటిటి ల కోసం వెబ్ సీరీస్ లలో నటిస్తున్న తమన్నా కి ఇప్పుడొక బంపర్ ఆఫర్ తగినట్లుగా చెబుతున్నారు.
నవంబర్ స్టోరీ, లెవెన్త్ అవర్ లాంటి వెబ్ సీరీస్ తో సత్తా చాటిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్ వెబ్ సీరీస్ కి ఓకె చెప్పిందట. ఎప్పుడో బాలీవుడ్ మూవీస్ లో అదృష్టాన్ని పరిక్షించుకున్న తమన్నా.. ఇప్పుడు వెబ్ సీరీస్ తో మరోసారి లక్కు ని పరీక్షించుకోబోతుంది. ఇప్పటికే తమన్నాతో వెబ్ సీరీస్ కథ చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో తమన్నా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ దాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ వెబ్ సీరీస్ లో ఎక్కువగా బాలీవుడ్ నటులే కనిపిస్తారని.. ఓ టాప్ డైరెక్టర్ ఈ వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది.