మంచు మోహన్ బాబు స్నేహానికి ప్రాణం పెట్టే వ్యక్తి అని తెలుసు. ఆయనకి ఇండస్ట్రీలో చిరు, బాలయ్య అందరూ స్నేహితులే.. ఒక్కోసారి కాంట్రవర్సీగా మాట్లాడినా.. అందరిని కలుపుకుపోయే గుణం మంచు మోహన్ బాబు ది. ఇక కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి మోహన్ బాబు కి ఉన్న స్నేహం గురించి అందరికి తెలిసిందే. ఎప్పటినుండో సూపర్ స్టార్ రజిని మోహన్ బాబులు ప్రాణ స్నేహితులే. ఈమధ్యనే రజినీకాంత్ తన సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకుని చెన్నై వెళ్లబోయే ముందు రెండు రోజులు మోహన్ బాబు ఇంట్లోనే ఉండి వారి అతిధి సత్కారాలు అందుకున్నారు. రజినీకాంత్, మోహన్ బాబు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.
ఇక తాజాగా మంచు వారింటికి మలయాళ సూపర్ స్టార్ విచ్చేసారు. ఆయనెవరో కాదు మలయాళ టాప్ హీరో మోహన్ లాల్. మోహన్ లాల్ ఈమధ్యనే తన సినిమా బ్రో డాడీ షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చారు. ఇక పృథ్వి రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రో డాడీ షూటింగ్ గ్యాప్ లో మోహన్ లాల్ మంచు ఫ్యామిలీ ఇంటికి వెళ్లి వాళ్లతో లంచ్ కూడా చేసారు. మంచు ఫ్యామిలీ లో మోహన్ బాబు, ఆయన భార్య, మంచు లక్ష్మి, మంచు విష్ణు ఆయన భార్య వెరోనికా మోహన్ లాల్ తో ముచ్చట్లు పెట్టుకుని ఎంజాయ్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.