Advertisementt

స‌ర్కారువారి పాట‌ బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్ టైమ్

Sat 07th Aug 2021 04:42 PM
mahesh babu,sarkaru vaari paata movie,superstar birthday blaster,sarkaru vaari paata teaser,superstar birthday blaster time announced  స‌ర్కారువారి పాట‌ బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్ టైమ్
Sarkaru Vaari Paata Superstar Birthday Blaster Time Announced స‌ర్కారువారి పాట‌ బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్ టైమ్
Advertisement
Ads by CJ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ లేటెస్ట్ మూవీ స‌ర్కారువారి పాట‌  లేటెస్ట్ మోస్ట్ అవెయిటింగ్ మూవీగా అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతోన్న ఈ చిత్రం గ‌త ప‌దిరోజులుగా డిజిట‌ల్ మీడియాలో డెయిలీ అప్‌డేట్స్‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆగ‌స్ట్ 9న మ‌హేశ్ పుట్టిన‌రోజు.. ఈ సంద‌ర్భంగా  గ్రాండ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను స్టార్ట్ చేసి ఫ‌స్ట్ నోటీస్ అంటూ రిలీజ్ చేసిన లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఇది స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. అందులో మ‌హేశ్ లుక్ ఇది వ‌ర‌కెన్న‌డూ లేనంత కొత్త‌గా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో శ‌నివారం చిత్ర యూనిట్ బ్లాస్ట‌ర్ టైమ్‌ను జీఐఎఫ్‌లో అనౌన్స్ చేశారు. ఆగ‌స్ట్ 9న ‘స‌ర్కారువారి పాట‌’ నుంచి ఆగ‌స్ట్ 9న ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు వీడియో విడుద‌లవుతున్నట్లు ప్ర‌క‌టించారు.

ఫ‌స్ట్ రిపోర్ట్ అనౌన్స్‌మెంట్‌లో మ‌హేశ్ బ్యాక్‌పోజులో చేతిలో బ్యాగుతో ఉన్న పోస్ట‌ర్ విడుదలైంది. ఇప్పుడు జీఐఎఫ్ మ‌హేశ్ ఫ్రంట్ పోజుతో న‌డుముకున్న బెల్టును క‌ట్టుకోవ‌డాన్ని చూడొచ్చు. మ‌హేశ్ లుక్ కూల్‌, ఛార్మింగ్‌గా ఉంది. ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు టీజ‌ర్ ఎలా ఉండ‌బోతుందోన‌నే అంచ‌నాలు ఆశాకాన్నంటాయి. సినీ ప్రేక్ష‌కులు, అభిమానులు డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌ను ఈ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్‌లో ఎంత కొత్త‌గా ఎలివేట్ చేస్తాడోన‌ని ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై  న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్న ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Sarkaru Vaari Paata Superstar Birthday Blaster Time Announced:

Mahesh Babu Sarkaru Vaari Paata Superstar Birthday Blaster Time Announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ