మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ మాములుగా లేదు. కానీ కీర్తి సురేష్ చేసిన చిన్న చిన్న తప్పిదాలే ఆమె కెరీర్ ని మార్చేసాయి. పవన్ తో అజ్ఞాతవాసి లాంటి సినిమా ఒప్పుకోవడం, అలాగే తమిళంలో విశాల్ లాంటి హీరోలతో ప్లాప్ సినిమాల్లో నటించడంతో కీర్తి సురేష్ క్రేజ్ మసకబారింది. అయితే మరోసారి బరువు తగ్గి ఫామ్ లో కొచ్చి... క్రేజ్ కోసం కష్టపడుతున్న కీర్తి సురేష్ మరోసారి రాంగ్ స్టెప్ వెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం మహేష్ బాబు తో క్రేజి మూవీ సర్కారు వారి పాతలో నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు మెగా స్టార్ చెల్లెలిగా నటించడానికి ఒప్పుకుంది అనే న్యూస్ చూసిన ఆమె ఫాన్స్ భయపడుతున్నారు.
చిరు - మెహెర్ రమేష్ కాంబోలో మొదలుకాబోతున్న వేదలమ్ రీమేక్ లో కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ కేరెక్టర్ లో నటించబోతుంది అని అంటున్నారు. వేదాళం మూవీలో అజిత్ సిస్టర్ గా లక్ష్మి మీనన్ నటించింది. అజిత్ కేరెక్టర్ తో సమానమైన కేరెక్టర్ లక్ష్మి మీనన్ కేరెక్టర్. ఇప్పుడు అదే కేరెక్టర్ కోసం కీర్తి సురేష్ ని మెహెర్ రమేష్ సంప్రదించాడు.. కీర్తి కూడా సానుకూలంగా ఉంది అనే న్యూస్ మొదలయ్యింది. అయితే కీర్తి సురేష్ ఇలా మెగాస్టార్ చెల్లెలిలా నటించడం ఆమె ఫాన్స్ కి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే స్టార్ హీరోల సరసన నటించి పేరు తెచ్చుకోవాలి కానీ.. ఇలా సిస్టర్ కేరెక్టర్స్ ఎందుకు నీకు అంటూ ఆమెని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.