కార్తీక దీపం మొదలైంది మొదలు డాక్టర్ బాబు కార్తీక్ విలన్ మోనిత మంచి ఫ్రెండ్స్. అంటే మోనిత కార్తీక్ ని ప్రేమించి కార్తీ ప్రేమించిన హిమనీ చంపించేసి.. డాక్టర్ బాబు కట్టుకున్న భార్య దీపని అనుమానించేలా చేసి.. పదేళ్లు విడగొట్టి.. వాళ్ళ మధ్యన చిచ్చుపెట్టి.. కార్తీక్ ని దక్కించుకోవడానికి ఏ అమ్మాయి చెయ్యని నీచానికి ఒడిగట్టినా.. కార్తీక్ కి మోనిత మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. మోనితకి అదే అలుసు. కార్తీక్ తనని గర్భవతిని చేసాడని నాటకం ఆడి, తనని పెళ్లి చేసుకోమంటూ కార్తీక్ వెంట పడుతుంది. కార్తీక్ దీప విషయంలో తప్పు తెలుసుకుని భార్యకి దగ్గరవ్వాలనుకుంటాడు.
కానీ మోనిత వికృత చేష్టలతో భయపెడుతుంది. మధ్యలో మోనిత హిమనీ చంపడానికి అంజి అనే వాడిని వాడుతుంది. మధ్యలో అంజి రియలైజ్ అయ్యి కార్తీక్ కి మోనిత గురించి నిజం చెప్పినా నమ్మడు. దీప ఎంత ట్రై చేసిన నమ్మని కార్తీక్ కి మోనిత విలనిజాన్ని అంజి బయటపెట్టినా నమ్మడు. కానీ దీప ఫోన్ సాక్ష్యంతో మోనిత నిజ స్వరూపాన్ని బట్టబయలు చెయ్యడంతో.. షాక్ అయిన కార్తీక్ మోనిత ఇంటికి వెళ్లి పెళ్లి కావాలా నీకు హిమని చంపినందుకు చావు ఇస్తా అంటాడు. దానితో కార్తీక్ కి నిజం తేలిసిపోయినందుకు షాకయిన మోనిత మాస్టర్ ప్లాన్ వేసి.. తాను చనిపోయినట్లుగా కార్తీక్ ని జైలు కు పంపే ఎపిసోడ్ మండే ప్రసారమవుతుంది.
పోలీస్ లు కార్తీక్ ని అరెస్ట్ చేసి జైలు కి తీసుకొళ్లే ఎపిసోడ్ మండే ప్రసారం అవుతుంది.