బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న అఖండ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. బాలకృష్ణ అఘోరాగా అదిరిపోయే పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. బోయపాటి బాలకృష్ణ ని చాలా అంటే చాలా పవర్ఫుల్ లుక్ లో చూపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అఖండ టీజర్స్ నందమూరి ఫాన్స్ కి మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులకి బాగా నచ్చింది. అయితే బాలకృష్ణ - బోయపాటి కాంబో అఖండ మూవీ క్లైమాక్స్ షూట్ తమిళనాడులో జరుగుతుంది. ఇక అక్కడ క్లయిమాక్స్ షూట్ అవ్వగానే హైదరాబాద్ లో అఖండ ప్యాచ్ వర్క్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కి వెళుతుంది టీం.
అయితే బాలకృష్ణ - బోయపాటి అఖండ మూవీ కి సంబందించిన ప్రమోషన్స్ కార్యక్రమాల కోసం బోయపాటి స్పెషల్ డేట్ చూశారట. ప్రస్తుతం కరోనా పరిస్థితులు అనుకూలించగానే.. అఖండ రిలీజ్ డేట్ ఇస్తామని చెప్పిన బోయపాటి.. అఖండ ప్రమోషన్స్ ని మాత్రం ఆగష్టు 15 నుండి మొదలు పెట్టబోతున్నారట. ఆగష్టు 15 న అఖండ ఫస్ట్ సింగిల్ వదిలే ప్లాన్ లో టీం ఉందట. అఖండ కి మ్యూజిక్ అందించిన థమన్.. అఖండకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని, సాంగ్స్ అన్ని అదిరిపోయేలా వచ్చాయని అంటున్నారు. థమన్ మ్యూజిక్, నేపధ్య సంగీతం సినిమాకి హైలెట్ కాబోతున్నాయని అంటున్నారు.