101 జిల్లాల అందగాడు సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ అనే స్థాయి నుండి .. టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేసిన సూపర్ స్టార్ మహేష్ అనే స్థాయికి మహేష్ ఎదిగిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ రేస్ విషయంలో గతంలో మహేష్ - పవన్ మధ్యన పోటీ ఉండేది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం, ప్రభాస్ పాన్ ఇండియా కి వెళ్లిపోవడంతో మహేష్ నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేసాడని అన్నారు. ఇక ఏడాది ఒక సినిమా చేస్తే మహేష్ బాబు ఫ్యామిలీ ని ఎంతో చక్కగా హ్యాండిల్ చేసే మహేష్ చిన్న టైం దొరికినా ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్ళిపోతాడు. పిల్లలు గౌతమ్, సితార లతో బాగా టైం స్పెండ్ చేస్తాడు. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరూ హిట్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది.
ఈ రోజు మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా సర్కారు వారి పాట లుక్స్ రిలీజ్ చేసింది టీం. గత వారం రోజులుగా మహేష్ బర్త్ డే ట్రీట్ పై ఫాన్స్ లో మంచి క్యూరియాసిటీని కలిగించిన సర్కారు వారి పాట నుండి ఆయన బర్త్ డే స్పెషల్ వచ్చేసింది. ఇక ఈ సినిమా తర్వాత కూడా మహేష్ లైనప్ మాములుగా లేదు. మహేష్ తదుపరి మూవీ ని త్రివిక్రమ్ కాంబోలో చేస్తుంటే.. ఆ తరవాత పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తో ఓ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ మహేష్ బాబు కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.