Advertisementt

సూపర్ స్టైలిష్ గా దుమ్మురేపాడు

Mon 09th Aug 2021 09:16 AM
mahesh babu,super star mahesh,mahesh birthday special,sarkaru vaari paata blaster  సూపర్ స్టైలిష్ గా దుమ్మురేపాడు
Sarkaru Vaari Paata Blaster Rocking సూపర్ స్టైలిష్ గా దుమ్మురేపాడు
Advertisement
Ads by CJ

మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ సర్కారు వారి పాట నుండి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. మే 30 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కే సర్కారు వారి పాట లుక్ ని ఎక్స్ పెక్ట్ చేసిన ఫాన్స్ కి సెకండ్ వేవ్ అడ్డుపడింది. అయితే ఆగష్టు 9 అంటే నేడు మహేష్ ఫాన్స్ కోరికను దర్శకుడు పరశురామ్ తీర్చేసాడు. గత వారం రోజుల నుండి మహేష్ ఫాన్స్ ని ఊరిస్తూ ఊరిస్తూ ఉన్న సర్కారు వారి పాట టీం.. ఆ సినిమా నుండి మహేష్ బర్త్ డే ట్రీట్ గా టీజర్ అదేనండి బర్త్ డే బ్లాస్టర్ అంటూ విడుదల చేశారు. అందానికే దిష్టి తగిలేలా ఉండే మహేష్ సర్కారు వారి పాట బర్త్ డే బ్లాస్టర్ లో ఇంకాస్త అందంగా కనిపించాడు.

సూపర్ స్టైలిష్ గా కనిపించడమేనా సర్కారు వారి పాట యాక్షన్స్ తో అదరగొట్టేసాడు. చాలా స్టైలిష్ గా యాక్షన్ చేసి చూపించాడు. ఇక మహేష్ లుక్స్ కూడా అద్భుతం అనేలా ఉన్నాయి. మెడ మీద రూపాయి బిళ్ళ టాటూ తోనే ఆసక్తి కలిగించిన పరశురామ్ ఇప్పుడు మహేష్ లుక్ ని, ఆయన స్టైలిష్ ని మరింత అందంగా టీజర్ లో చూపించాడు. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మహేష్ కారు నుండి బయటికి వచ్చి విలన్స్ ని చితక్కొట్టే సీన్స్ టీజర్ కే హైలెట్ అనేలా ఉంది. మరి మహేష్ ఫాన్స్ కి ఆయన బర్త్ డే సందర్భంగా పరశురామ్ ఈ టీజర్ తో ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు.

Sarkaru Vaari Paata Blaster Rocking:

Mahesh Birthday Special: Sarkaru Vaari Paata Blaster 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ