ఆర్.ఆర్.ఆర్ హీరోలు రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లు ఉక్రెయిన్ షూట్ లో ఉన్నారు. నిజమైన ఇద్దరు స్నేహితులు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఫాన్స్ కి అతిపెద్ద పండగే. ఇప్పుడు ఈ ఇద్దరు స్నేహితులు.. కలిసి ఆర్.ఆర్.ఆర్ లో ఫ్రెండ్స్ గానే కనిపిస్తున్నారు. మరి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే,.. ఆ ఇద్దరు షూటింగ్ కోసం సెట్స్ లో ఉంటే అక్కడ వాళ్ళని చూసేవారికి కన్నుల పండగే. ఇక వీరు సెట్ లో చేసే అల్లరి మాములుగా లేదు. ఇక తాజాగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లో ఆర్.ఆర్.ఆర్ సెట్ లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. సెట్ లో రామ్ చరణ్ అసహనంగా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ వచ్చి.. చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయ్యిందా.. అని అడగ్గా.. అయిపోయింది. నిజమైన డ్రమ్స్ ఎక్కడ కార్తికేయ. కాస్ట్యూమ్ లేదు. ఏం లేవు. పొద్దుపొద్దునే తీసుకువచ్చి కూర్చొపెట్టారు అని రాజమౌళి కొడుకు కార్తికేయ ని అంటూ రామ్ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అది ఫన్నీ గానే ఉన్నా.. ఇప్పుడు ఆ వీడియో మాత్రం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఇక అక్కడే ఉన్న కార్తికేయ.. వస్తున్నాయి. రెండు నిమిషాలు అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ మాత్రం అక్టోబర్ 13 నే రిలీజ్ అవుతుంది అంటూ మరోసారి ఆ వీడియో ద్వారా స్పష్టం చేసారు. ఇక ఆర్.ఆర్.ఆర్ టీం ఉక్రెయిన్ వెళ్ళినప్పటినుండి అక్కడ సెట్ లో జరిగే సరదాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది టీం.