కరోనా పాండమిక్ టైం లో ప్రేక్షకుల సంగతి ఎలా ఉన్నా.. గత వారం ఆరేడు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీ తో పాటుగా ముగ్గురుమొనగాళ్ళు, మెరిసే మెరిసే లాంటి చిన్న చిత్రాల హడావిడి కనిపించినా ప్రేక్షకుల సందడి మాత్రం థియేటర్స్ దగ్గర మిస్ అయ్యింది. అయినప్పటికీ వారం వారం సినిమాల రిలీజ్ ల విషయంలో ఎవ్వరూ తగ్గడం లేదు. ఇక ఈ శుక్రవారం కూడా చిన్న సినిమాల క్యూ ఉంది. అందులో ఆగష్టు 13 న రిలీజ్ అయ్యే సినిమాలకు లాంగ్ వీకెండ్ అంటే ఆగష్టు 15 కూడా కలిసొస్తుంది. అయినా మీడియం సినిమాలేవీ ధైర్యం చెయ్యలేకపోతున్నాయి. కానీ చిన్న సినిమాల డేట్స్ మాత్రం వరసేట్టేశాయి.
అందులో విశ్వక్ సేన్ నటించిన పాగల్ మూవీ మాత్రమే కాస్త ఇంట్రెస్ట్ కలిగించే సినిమా. ఆగష్టు 14 న విశ్వక్ సేన్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఒక రోజు ముందే అంటే.. ఆగష్టు 13 న కమెడియన్ సునీల్ నటించిన కనబడుటలేదు సినిమా, అలాగే లవ్లీ హీరో సిద్దార్థ్ లేటెస్ట్ మూవీ ఒరేయ్ బామ్మర్ది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే పూర్ణ నటించిన సుందరి సినిమా కూడా ఆగష్టు 13 నే రిలీజ్ కి సిద్దమంటుంది.