అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. పుష్ప సినిమా ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయబోతున్నారు. పుష్ప పార్ట్ వన్ ని డిసెంబర్ లో క్రిష్టమస్ కి రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇక పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ చెయ్యబోయే సినిమా పై అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే అల్లు అర్జున్ పుష్ప తర్వాత వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ తో ఐకాన్ చేయబోతున్నాడనే న్యూస్ ఉంది. అసలైతే కొరటాల తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ చెయ్యాల్సి ఉంది. కానీ కొరటాల ఎన్టీఆర్ కి షిఫ్ట్ అవడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ పై అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. ఇక దిల్ రాజు అల్లు అర్జున్ ని ఒప్పించి ఐకాన్ ని పట్టాలెక్కించబోతున్నాడని అంటున్నారు.
వేణు శ్రీరామ్ ఐకాన్ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దడమే కాదు.. ఐకాన్ లో అల్లు అర్జున్ ఇద్దరు హీరోయిన్స్ ని తీసుకురాబోతున్నారట. అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకేక్కిన్చాలని దిల్ రాజు ప్లాన్ అంట. అందుకే అల్లు అర్జున్ కోసం ఆ ఇద్దరిని బాలీవుడ్ నుండి దింపాలని చూస్తున్నారట. రష్మిక, పూజ హెగ్డే లాంటి టాప్ హీరోయిన్స్ తో ఆల్రెడీ రొమాన్స్ చేసిన అల్లు అర్జున్ ఈ సరి మాత్రం బాలీవుడ్ భామలనే లైన్ లో పెట్టడానికి డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. అందులో కూడా కియారా - అలియా లాంటి టాప్ హీరోయిన్స్ నే పరిశీలిస్తున్నానట్లుగా టాక్.