Advertisementt

శివాత్మిక ప్లేస్ లో అనిఖా?

Wed 11th Aug 2021 11:19 AM
anikha surendran,kappela remake,shivathmika  శివాత్మిక ప్లేస్ లో అనిఖా?
Anikha surendran kappela telugu remake శివాత్మిక ప్లేస్ లో అనిఖా?
Advertisement
Ads by CJ

రాజశేఖర్ కూతురు శివాత్మిక ఇప్పుడు తెలుగు, తమిళ్ ప్రాజెక్ట్స్ తో బిజీ గా మారింది. శివాని, శివాత్మిక హీరోయిన్స్ గా మారి.. నెమ్మదిగా కెరీర్ లో నిలదొక్కుకుంటున్నారు. ఇక తాజాగా శివాత్మిక హాట్ ఫోటో షూట్స్ తోను సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. అయితే ఇప్పుడు శివాత్మిక ఓ సినిమాకి సైన్ చేసి షూటింగ్ మొదలైన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి. సితార ఎంటరైన్మెంట్స్ లో సిద్ధూ జొన్నలగడ్డ, అర్జున్‌దాస్‌ కీలక పాత్రల్లో తెరకెక్కబోతున్న కప్పెలా రీమేక్ లో శివాత్మిక హీరోయిన్ గా సైన్ చేసింది. అయితే గత నెలలో ప్రారంభమైన ఈ సినిమాలో శివాత్మికకు బదులుగా ఇప్పుడు అనిఖాను తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శివాత్మిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందా? లేదంటే తప్పించారా అనేది తెలియరాలేదు.

ఇక ఇప్పడు ఈ సినిమాకి హీరోయిన్ గా శివాత్మికకి బదులుగా ఎంపిక చేసిన చిన్నది అనిఖా ఎవరో కాదు.. అజిత్ - నయనతార కాంబోలో గతంలో వచ్చిన విశ్వాసం మూవీలో అజిత్ కి కూతురు గా నటించిన పాప. అనిఖా ఇప్పటికే కన్నడ, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించడమే కాదు.. ప్రవీణ్ సత్తారు - నాగ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఇప్పుడు శివాత్మిక ప్లేస్ లో కప్పెలా రీమేక్ లో నటించబోతుంది 

Anikha surendran kappela telugu remake:

Anikha Surendran bags role meant for Shivathmika

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ