కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల విషయంలో ఎంత క్రేజీగా హైలెట్ అవుతుందో ప్రియుడు విగ్నేష్ శివన్ తో పెళ్లి విషయంలోనూ అంతే హైలెట్ అవుతుంది. నయనతార - విగ్నేష్ శివన్ ల పెళ్లి వార్త కోసం ఇండియా మాత్రమే కాదు.. ఫాన్స్ కూడా కాచుకుని కూర్చున్నారు. అయితే ఈ మధ్యన పెళ్లి విషయం చర్చకు వచ్చినప్పుడు విగ్నేష్.. త్వరలోనే నయన్ తో పెళ్లి, కాకపోతే పెళ్లి అంటే చాలా ఖర్చు కదా.. అందుకే డబ్బులు సంపాదించుకుంటున్నాం అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాదు.. నయనతార తో కరోనా హడావిడి ముగిసిపోతే పెళ్లి ఉంటుంది అని చెప్పాడు. తాజాగా నయనతార కూడా విగ్నేష్ తో పెళ్లిపై స్పందించింది.
స్పందించడమే కాదు.. తమకి ఎంగేజ్మెంట్ అయినట్లుగా చెప్పి షాకిచ్చింది. విగ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ అయ్యింది అని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా నయనతార ఓ ఇంటర్వ్యూలో కన్ ఫర్మ్ చేసేసింది. అయితే నయనతార - విగ్నేష్ శివన్ ల జంట త్వరగా పెళ్లి పై ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం నయన్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని, కూతురు పెళ్లి చూడాలని ఆయన కోరడంతోనే నయనతార పెళ్లి వైపు అడుగులు వేస్తున్నట్టుగా టాక్.