Advertisementt

సర్కారు వారి పాట హీరో తో పుష్ప డైరెక్టర్

Thu 12th Aug 2021 07:14 PM
pushpa director,sukuamr,mahesh babu,sarkaru vaari paata movie,mahesh with sukuamr,ad shoot  సర్కారు వారి పాట హీరో తో పుష్ప డైరెక్టర్
Pushpa Director bumps into Mahesh babu during an ad shoot సర్కారు వారి పాట హీరో తో పుష్ప డైరెక్టర్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ తో బాగా బిజీగా వున్నారు. రీసెంట్ గా మహేష్ బర్త్ డే రోజున బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ తో మహేష్ ఫాన్స్ నానా హంగామా చేసారు. ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ ని మరో టాప్ డైరెక్టర్ సుకుమార్ కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది. అంటే సుకుమార్ తో మహేష్ ఇంతకుముందే వన్ నేనొక్కడినే లాంటి సినిమా కూడా చేసాడు. సుకుమార్ తో మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా చేసాడు. అంతవరకూ ఓకె. ఆ తర్వాత అంటే రంగస్థలం తర్వాత సుకుమార్ మహేష్ కి లైన్ వినిపించి సినిమా అనౌన్స్ చెయ్యగా.. ఆ తర్వాత మహేష్ ఉన్నట్టుండి క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన తమ సినిమా ఆగిపోయింది అని ప్రకటించడం తో సుకుమార్ కి మహేష్ కి మధ్యన విభేదాల వలనే సినిమా ఆగిపోయింది అని అనుకున్నారు.

అప్పటినుండి మహేష్ - సుకుమార్ ల మేటర్ అప్పడుప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నా.. ప్రస్తుతం సుకుమార్ పుష్ప పాన్ ఇండియా షూటింగ్ తోనూ, మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ తో బిజీగా ఉంటున్న టైం లో.. మహేష్ బాబు, సుకుమార్ కలిసి కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. సర్కారు వారి పాట షూటింగ్ సెట్స్ లో కాకుండా మహేష్ - సుకుమార్ ఓ యాడ్ షూట్ లో కలుసుకుని చాల రకాల ముచ్చట్లు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. దానితో వారి మధ్యన ఎలాంటి విభేదాలు లేవని మహేష్ ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక సుకుమార్ - మహేష్ కలిసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. 

Pushpa Director bumps into Mahesh babu during an ad shoot:

Sukumar with Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ