పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. లాక్ డౌన్ ఎత్తేసి ప్రజలు సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. అందులో భాగగమే చాలా రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు మొదలై థియేటర్స్ ఓపెన్ అవడంతో చిన్న చితక సినిమాలు థియేటర్స్ బాట పడుతున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యి సినిమాలు రిలీజ్ అవుతున్నా.. పెద్ద, మిడియం బడ్జెట్ మూవీస్ థియేటర్స్ లోకి రావడానికి ఇంకా సంకోసిస్తున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి ఆలోచిస్తున్నారు.. కాబట్టే మేకర్స్ సినిమాలు రిలీజ్ చెయ్యడానికి ఆలోచనలో పడ్డారు. ఇక జులై లో రిలీజ్ కావాల్సిన కెజిఎఫ్ 2 కి విడుదల వాయిదా పడి క్రిష్ట్మస్ రిలీజ్ అంటున్నారు. కన్నడలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ మూవీ పాన్ ఇండియాలో సంచలనంగా మారి.. సూపర్ డూపర్ హిట్ అవడంతో కెజిఎఫ్ 2 పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.
అయితే థియేటర్స్ వ్యవస్థ ఇంకా మెరుగుపడకపోవడంతో కెజిఎఫ్ 2 ని మేకర్స్ ఏమన్నా ఓటిటికి విక్రయిస్తారమేమో అని బడా ఓటిటి కంపెనీ లు కెజిఎఫ్ మేకర్స్ చుట్టూ తిరుగుతూన్నాయట. కెజిఎఫ్ కి అన్ని భషాల్లో కలిపి 250 కోట్ల డిజిటల్ డీల్ ఇవ్వగా కెజిఎఫ్ మేకర్స్ మాత్రం ఓటిటి డీల్ కి ఒప్పుకోవడం లేదట. 250 కోట్లు మాకొ లెక్క కాదు.. థియేటర్స్ పరిపూర్ణంగా ఓపెన్ అయినప్పుడు మా సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఓటైటిలు సైలెంట్ అయ్యాయట.