స్టార్ మా లో రాత్రి 7.30 నిమిషాలకు ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ కి బుల్లితెర ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారో ఆ సీరియల్ కి వచ్చే టీఆర్పీ రేటింగ్ చూస్తే తెలిసిపోతుంది. గత మూడేళ్ళుగా కార్తీక్ అదేనండి డాక్టర్ బాబు అనుమానాలకు బలయిన దీప (వంటలక్క) ఎలాగో భర్తకి చేరువయ్యింది అనుకుంటే.. మధ్యలో విలన్ మోనిత కడుపు నాటకంతో కార్తీక్ ని పెళ్లి చేసుకుంటాను అంటూ అందరిని డెరిస్తూ ఎసిపి రోషిణికి ఫిర్యాదు చేస్తుంది. కార్తీక్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే.. దీప భర్తకి అండగా నిలబడుతుంది. ఈలోపు మోనిత కుట్రలను దీప బట్టబయలు చేసి.. కార్తీక్ కి సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది.
మోనిత కుట్రలు, మోసాన్ని తట్టుకోలేకపోయిన కార్తీక్ మోనితని చంపడానికి బయలుదేరుతాడు. అక్కడ గన్ పేలిన శబ్దంతో అల్లుడు కార్తీక్ మోనిత ని చంపాడనుకుని దీప పిన్ని భాగ్యం పోలీస్ ఆఫీసర్ రోషిణికి చెబుతుంది. దానితో రోషిని కార్తీక్ ని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది. అమెరికా నుండి వచ్చిన కార్తీక్ తల్లి సౌందర్య కొడుకు కార్తీక్ ని కాపాడుకోవడానికి మోనిత హత్య తానే చేసినట్టుగా చెబుతుంది. కానీ ఏసిపి రోషిని మాత్రం మీరు రెండు గంటల ముందు అమెరికా నుండి ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. మరి నిన్న మోనితని ఎలా హత్య చేసారంటూ సౌందర్యకి షాకిస్తుంది. మీ తల్లి ప్రేమ మీదగ్గరే ఉంచుకోండి. మీ కొడుకు మరో ఆడదానితో తిరుగుతుంటే మీరెందుకు మందలించలేదు. కొడుకు మీద నమ్మకమా? దీపకి భర్త మీద నమ్మకా? కొడుకు మరో ఆడదానికి కడుపు చేసి, పెళ్లి పేరెత్తగానే హత్య చేసాడు అని రోషిని అనగానే సౌందర్య ముందు మోనిత నా కొడుకు వలన గర్భవతి కాలేదు.
కృత్రిమ గర్బధారణ వల్ల ఆమె గర్బవతి అయింది. కావాలంటే సంతాన సాఫల్య కేంద్రంలోని టెక్నిషియన్‌ను అడగండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి. మీ దర్యాప్తును అక్కడి నుంచే ప్రారంభించండి అంటూ సౌందర్య షాకిచ్చింది. మోనిత తన కొడుకు వలన గర్భవతి కాలేదు.. అని మోనిత కుట్రని కార్తీక్ తల్లి సౌందర్య బట్టబయలు చేసిన ఈ ఎపిసోడ్ ఈ రోజు రాత్రి స్టార్ మా లో ప్రసారం కానుంది.