ఏ హీరో అయినా తన సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఆ సినిమాని అబ్బో చాలా గొప్ప సినిమా అంటూ ప్రమోట్ చెయ్యడమనేది చాలా సహజం. కానీ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం అలా కాదు.. నా సినిమాని ఇప్పటికే చాలామంది చూసారు. సినిమా సూపర్ హిట్టు. సినిమా రిలీజ్ అయిన మొదటి షోకి సినిమానే మాట్లాడుతుంది. నాకు పాగల్ సినిమాపై విపరీతమైన నమ్మకం ఉంది. అందుకే నన్ను అలా నమ్మకంగా మాట్లాడించేలా చేస్తుంది. ఫస్ట్ షో పడ్డాక నేను కాదు నా సినిమా మాట్లాడుతుంది.. నాకు సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు.. నేను నా కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పడమే కాదు.. రివ్యూస్ పై విశ్వక్ సేన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
రేపు విడుదల కాబోతున్న పాగల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. తాను నటించిన ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ సినిమాలు రెండూ బావున్నాయి. రెండు సినిమాలు మంచి సినిమాలే. కానీ అదేం విచిత్రమో.. ఆ రెండు సినిమాలకు రివ్యూస్ బాగా రాలేదు. అసలు అదేంటో నా సినిమాలంటే రివ్యూ రైటర్లు మోసేస్తుంటారు. అయితే పాగల్ విషయంలో మాత్రం నన్ను మరీ అంత మోయకండి.. రివ్యూ రైటర్స్ పర్సనల్ ఎజెండాతో రివ్యూలు రాయకుండి. ఏ హీరో కి లేని ఈ సమస్య నాకే ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అంటూ రివ్యూస్ విషయంలో విశ్వక్ సేన్ పాగల్ ఇంటర్వ్యూ లో సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
మరి రివ్యూ రైటర్స్ ఉన్నది ఉన్నట్టుగా.. అంటే సినిమా బావుంది అంటే బావుంది అని, బాలేదు అంటే బాలేదు అని రాస్తారు. ఒక్క విశ్వక్ సేన్ విషయంలో రివ్యూ రైటర్స్ ఏదో తప్పు చేసారని చెప్పడం మాత్రం విడ్డురమే కదా..