Advertisementt

NTR30 కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

Fri 13th Aug 2021 02:59 PM
anirudh ravichandran,ntr30,compose music for ntr30,koratala shiva - ntr combo,koratala shiva  NTR30 కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
Is he the music director for NTR30? NTR30 కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఫినిష్ చేసేందుకు ఉక్రెయిన్ వెళ్ళాడు. అక్కడ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్.. హైదరాబాద్ కి వచ్చేస్తాడు. ఇక్కడ ఆచార్య పనులు చక్కబెట్టుకుంటున్న కొరటాల NTR30 కి రెడీ అవుతాడు. కొరటాల - ఎన్టీఆర్ కాంబోలో NTR30 అక్టోబర్ నుండి మొదలవుతుంది అనే టాక్ ఉంది. అయితే  ఈసినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు గట్టిగానే వినిపిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా కానీ, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కానీ నటించే అవకాశం ఉంది అంటున్నారు. ఇక NTR30 పై ఎలాంటి అప్ డేట్ లేకుండానే సోషల్ మీడియాలో NTR30 ట్రెండ్ అవుతుంది.

NTR30 కి తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఫిక్స్ అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ లో NTR30 ని ట్రెండ్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళం లో టాప్ లేపడమే కాదు... ఇక్కడ పాన్ ఇండియా లేవల్లోనూ NTR30 కి టాప్ లేపడం ఖాయం అంటున్నారు ఫాన్స్. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి అవ్వగానే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి సంబందించిన షూటింగ్ లో పాల్గొంటారని, కొన్ని ఎపిసోడ్స్ ని ఆర్.ఆర్.ఆర్ టీం ఉక్రెయిన్ కి వెళ్లకముందే పూర్తి చేసిన ఎన్టీఆర్ మరోసారి కొరటాల శివ సెట్స్ లోకి జాయిన్ అయ్యేముందే మరికొన్ని ఎపిసోడ్స్ పూర్తి చేస్తారట. ఆ తర్వాత ఏకధాటిగా కొరటాల తో NTR30 షూట్ లో ఎన్టీఆర్ పాల్గొంటాడని తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో NTR31 చేయబోతున్న విషయం తెలిసిందే.

Is he the music director for NTR30?:

Anirudh to Compose Music for NTR30?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ