Advertisementt

కార్తీక దీపం: డాక్టర్ బాబు హత్య చెయ్యలేదు

Sat 14th Aug 2021 11:12 AM
karthika deepam serial,karthika deepam serial update,karthik,deepa,vantalakka,docotr babu  కార్తీక దీపం: డాక్టర్ బాబు హత్య చెయ్యలేదు
Today Karthika Deepam Serial Update కార్తీక దీపం: డాక్టర్ బాబు హత్య చెయ్యలేదు
Advertisement
Ads by CJ

కార్తీక దీపం సీరియల్ ట్విస్ట్ లతో బుల్లితెర ప్రేక్షకులని తెగ ఎంటర్టైన్ చేస్తుంది. విలన్ మోనిత నిజ స్వరూపం బయటపడి.. ప్రస్తుతం హత్య నాటకం ఆడుతుంది. డాక్టర్ బాబు కార్తీక్ మోనితని హత్య చేసాడనే ఆరోపణలతో ఏసిపి రోషిని కార్తీక్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. మోనిత కి కడుపు చేసి.. పెళ్లి చేసుకోమంటే హత్య చేసాడు అంటూ రోషిణి కార్తీక్ తల్లి సౌందర్యని నిలదీసింది. ఇక సౌందర్య కూడా కొడుకు తప్పుచేసాడేమో అని దీపతో అంటే.. అదేంటి అత్తయ్య మీ కొడుకు తప్పు చేసాడని మీరు నమ్ముతున్నారా.. అంటే.. నువ్వు నమ్మడం లేదా? అనగా దానికి దీప ఆయన్ని పోలీస్ లు అరెస్ట్ చేసేటప్పుడు మోనిత కి నేను కడుపు చేశాను అనేది ఎంత నిజమో.. మోనిత ని హత్య చేశాను అనేది అంతే నిజం అంటూ వైరాగ్యంతో పోలీస్ లు కూడా వెళ్లిపోవడంతో దీప మోనితని కార్తీక్ చంపాడు అనేది నిజం కాదు అంటూ నమ్ముతుంది. అదే విషయాన్ని అందరికి చెబుతుంది.

ఇక ఏసిపి రోషిణి రోడ్డు మీద వెళుతున్న మోనిత పనిమనిషి ప్రియమణి ని స్టేషన్ కి తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేసింది. మోనిత అమ్మలాగా చూసుకునేది.. అమ్మ అవుతుంది అనగానే సంతోష పడ్డాను. కానీ ఇలా కార్తీక్ బాబు చేతిలో చచ్చిపోయింది. చివరికి మోనిత శవం అయినా ఇప్పించండి అంటూ అడుగుతుంది. ఇక దీప కార్తీక్ ని కలిసి తలరాతను ఎవరూ మార్చలేరు అనగా.. అప్పుడు నేను అవమానించి కష్టపెట్టాను.. కానీ ఇప్పుడు జైల్లో మళ్ళీ చూడలేనేమో అని వచ్చావా.. అని అనగా మీరు హత్య చెయ్యలేదని నేను నమ్ముతున్నాను అని.. రోషిణి దగ్గరకి వెళ్లగా.. మోనిత శవం ఎక్కడుందో నీ భర్తను చెప్పమను.. కార్తీక్ కి తక్కువ శిక్ష పడేలా చేస్తాను... అనగా దీప చాలా ఆగ్రహంగా లేస్తుంది. అది ఈ రోజు ఎపిపోడ్ లో స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. 

Today Karthika Deepam Serial Update:

Karthika Deepam Serial Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ