Advertisementt

బంగార్రాజు ముహూర్తం ఫిక్స్

Sat 14th Aug 2021 09:25 PM
nagarjuna,kalyan krishna,bangaraju movie,bangaraju muhurtam fix  బంగార్రాజు ముహూర్తం ఫిక్స్
Nagarjuna Bangaraju Muhurtam Fix బంగార్రాజు ముహూర్తం ఫిక్స్
Advertisement
Ads by CJ

నాగార్జున తన డ్రీం ప్రాజెక్ట్ బంగార్రాజు ని లైన్ లో పెట్టేసాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేస్తున్న నాగార్జున.. ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే నాగార్జున తన డ్రీం ప్రాజెక్ట్ ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉండగా.. అది ఇప్పటికి పట్టాలెక్కడానికి రెడీ అయ్యింది. సోగ్గాడే చిన్న నాయన మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ బంగార్రాజు స్క్రిప్ట్ పై నాగార్జున ఇప్పటివరకు అలోచించి అలోచించి చివరికి ఓకె చేసి.. పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడు. రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 

నాగ చైతన్యకి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో మోనాల్ గజ్జర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ముహూర్తం ఆగష్టు 16 న కుదిరినట్టుగా సమాచారం. ఆగష్టు 16 పూజా కార్యక్రమాలతో బంగార్రాజు మొదలు కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా అనూప్ రూబెన్స్ పూర్తి చేశాడు. మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుని జనవరిలో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. 

Nagarjuna Bangaraju Muhurtam Fix:

Nagarjuna - Kalyan Krishna Bangaraju Muhurtam Fix

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ