Advertisementt

మొదటి తప్పుగా హెచ్చరించి వదిలేసారు

Sun 15th Aug 2021 11:56 AM
hema,actress hema,maa elections,maa  మొదటి తప్పుగా హెచ్చరించి వదిలేసారు
Hema warned by DRC మొదటి తప్పుగా హెచ్చరించి వదిలేసారు
Advertisement
Ads by CJ

కరోనా తో ఇండస్ట్రీ అతలాకుతలం అయ్యి.. మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.  సెకండ్ వేవ్ తో అల్లాడిపోయిన ఇండస్ట్రీ ఇప్పుడు మా ఎన్నికల విషయంలో మళ్ళీ హీటెక్కుతుంది. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు మధ్యన హోరా హోరి యుద్ధం జరుగుతుంటే.. మధ్యలో మరో కంటెస్టెంట్ హేమ మా ఎన్నికల మేటర్ ని కెలుకుతుంది. ప్రస్తుత మా అధ్యక్షడు నరేష్ మా నిధులు గోల్ మాల్ చేసాడని.. మా ఎన్నికలు నిర్వహించకుండా మళ్ళీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ట్రై చేస్తూన్నాడంటూ హాట్ హాట్ గా మాట్లాడింది.  

నరేష్ హేమ విషయాన్నీ కాస్త  సీరియస్ గానే తీసుకుని హేమపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ సంఘానికి (డీఆర్‌సీ) ఫిర్యాదు చేశారు. దానితో హేమ కి క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆమెని కోరింది. అయితే హేమ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన క్రమశిక్షణ సంఘం హేమని మొదటి తప్పుగా హెచ్చరించి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకుండానే వదిలిపెట్టింది. కాకపోతే మళ్ళీ మళ్ళీ ఇలా జరిగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హేమని హెచ్చరించింది.

Hema warned by DRC:

Actress Hema warned by DRC

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ