ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో 3D లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ పై భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు లో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా అంటే రావణ్ పాత్రలో, కృతి సనన్ సీత గా నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ ఫినిష్ చేసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక గత నెలలో ముంబై లో ఆదిపురుష్ రెస్యూమ్ షూట్ ని రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ మీద మొదలు పెట్టి.. కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఓం రౌత్.
ఓం రౌత్ కూడా ప్రభాస్ వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండి.. ఆదిపురుష్ సెట్ లో లేకపోయినా.. రావణ్ పాత్రధారి సైఫ్ పై కీలక సన్నివేశాలను పూర్తి చేసి.. ప్రభాస్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రేపు ఆదిపురుష్ సెట్ లో ప్రభాస్ జాయిన్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆదిపురుష్ షూటింగ్ కోసం ప్రభాస్ ముంబై రాబోతున్నట్టుగా సమాచారం. ప్రభాస్ ఆదిపురుష్ సెకండ్ షెడ్యూల్ లో పాల్గొనడానికి ముంబై వస్తున్నారని తెలిసిన ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ హడావిడి మొదలు పెట్టారు.