Advertisementt

దేశంలో అదుపులోకి వస్తున్న కరోనా

Tue 17th Aug 2021 11:08 AM
india,corona virus,covid 19,corona cases,india corona cases,corona vaccine  దేశంలో అదుపులోకి వస్తున్న కరోనా
India Corona update దేశంలో అదుపులోకి వస్తున్న కరోనా
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ ఉధృతి తగ్గి.. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వందల్లోనే నమోదు అవుతున్నాయి. అంతేకాదు.. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా కొత్త కేసులు 25 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. కొత్త కేసులు సుమారు ఐదు నెలల కనిష్ఠానికి చేరాయి. ముందురోజుతో పోల్చితే 23.5 శాతం మేర తగ్గాయి. అదే సమయంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది. 

తాజాగా మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. నిన్న 15,63,985 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 25,166 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరాయి. గత కొద్దికాలంగా కేరళలో నిత్యం 20వేల కేసులు వెలుగుచూస్తుండగా.. తాజాగా అవి 12 వేలకు పడిపోయాయి.

India Corona update :

Today India Corona update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ