అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప మూవీపై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలే ఉన్నాయి. మాస్ క మహారాజ్ లా కనిపిస్తున్నారు అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ పై భీభత్సమైన అంచనాలున్నాయి. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో అంటే క్రిష్ట్మస్ కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ మూవీ చేయబోతున్నాడనే టాక్ ఉంది. దిల్ రాజు వేణు శ్రీరామ్ - అల్లు అర్జున్ మధ్యలో మీటింగ్ పెట్టి ఐకాన్ పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నడని తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కియారా కానీ, అలియా భట్ కానీ నటించబోతుంది అనే ప్రచారం ఉండగా.. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన లైగర్ హీరోయిన్ అనన్య పాండే కానీ, శ్రీదేవి కూతురు జాన్వీ కానీ నటించే ఛాన్స్ ఉంది అంటున్నారు. అనన్య లైగర్ తో పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ అవుతుంది. అలాగే శ్రీదేవి కూతురు అల్లు అర్జున్ తో అయితే.. బెస్ట్ తెలుగు డెబ్యూ అవుతుంది. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక వేణు శ్రీరామ్ ఐకాన్ స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది.