ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు మొదలు పెడుతున్నారంటే.. ఆ హీరో ని ఢీ కొట్టబోయే విలన్ ఎవరో అంటూ అందరిలో ఆసక్తి మొదలవుతుంది. అల్లు అర్జున్ పుష్ప మొదలు పెట్టినప్పుడు విజయ్ సేతుపతి పుష్ప విలన్ అనగానే అందరిలో అంచనాలు మొదలయ్యాయి. ఇక ఎన్టీఆర్ - కొరటాల కాంబో మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. అలాగే ప్రభాస్ సలార్ మెయిన్ విలన్ పై రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. అంతేకాకుండా మహేష్ సర్కారు వారి పాట విలన్ ని ఎప్పుడు రివీల్ చేస్తారో అనే ఆసక్తితో మహేష్ ఫాన్స్ ఉన్నారు. ఇక పుష్ప విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయాన్ని ఎంతో గ్రాండ్ గా ప్రకటించింది టీం. విజయ్ సేతుపతి తో పాటుగా ఫహద్ ఫాజిల్ ఇప్పుడు స్టార్ హీరోల పాలిట క్రేజీ విలన్ గా తయారయ్యాడు.
ఇప్పటికే తమిళనాట ఫహద్ ఫాజిల్ విలనిజాన్ని కోలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక పుష్ప తో తెలుగు ఆడియన్స్ ని అలరించబోతున్నాడు. అందుకే RCA 15 కోసం రామ్ చరణ్ ని ఢీ కొట్టాలంటే ఫహద్ ఫాజిల్ అయితే బావుంటుంది అని శంకర్ ఆలోచనట. ఇప్పటికే ఫహద్ తో చర్చలు పూర్తి చేసిన శంకర్ అతని కేరెక్టర్ ని RCA 15 లో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో చూపించబోతున్నారట. ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన హీరోను విలన్ తన బుద్ధిబలంతో ఢీకొట్టే విధానం చాలా విబిన్నంగా ఉంటుందట. రామ్ చరణ్ vs ఫహద్ కాంబో సీన్స్ ని శంకర్ చాలా అద్భుతంగా రాసుకున్నారని అంటున్నారు. సో ఫహద్ పేరుని కూడా శంకర్ అండ్ కో త్వరలోనే రివీల్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది.