యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఉక్రెయిన్ లో ముగించుకుని.. హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ హైదరాబాద్ కి అడుగుపెట్టడమే అత్యంత విలువైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును సొంతం చేసుకున్నారు. మామూలుగానే ఎన్టీఆర్ కి మోడరన్ బైక్స్ అయినా, అలాగే కొత్త కార్లు అయినా బాగా ఇష్టపడే వ్యక్తి. ఇప్పుడు ఎన్టీఆర్ తనకి ఎంతో ఇష్టమైన 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్ లంబోర్ఘిని కారుని విదేశాల నుండి తెప్పించుకుని సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ కొన్న ఆ కాస్ట్లీ కారు స్పెషల్స్ ఏమిటంటే... ఈ కారు నేరో నోక్టిస్ మ్యాటే విత్ ఆరాన్సియో ఆర్గోస్ కలర్‌తో కోటింగ్ చేయబడింది.
305 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ కారు 8 స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది. అంతే కాక లంబోర్ఘిని కారు 2.2 టన్నుల సూపర్ ఎస్‌యూవీ 305 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మరి గంటకు 305 కిలోమీటర్లు దూసుకెళుతుంది అంటే.. మన హైదరాబాద్ టు విజయవాడ గంటలో వెళ్లిపోవచ్చన్నమాట. ఇంకా ఈ కారు స్పెషాలిటీ ఏమిటంటే.. లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు కేవలం 3.6 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఈ కారులో ఎక్కువ లగేజ్ ఉంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా లంబోర్ఘిని ఉరుస్ ఇంటీరియర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మరి ఎన్టీఆర్ చేతిలోకి రాగానే ఈ కారు ఆకర్షణ ఇంకా పెరిగింది అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.