చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ షూటింగ్ తో పాటుగా.. ఆయన 153 మూవీ ని తమిళ దర్శకుడు మోహన్ రాజా కాంబోలో చేస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫర్ రీమేక్ చేస్తున్న చిరు.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక రేపు సాయంత్రం చిరు 153 టైటిల్ పోస్టర్ ని రివీల్ చెయ్యబోతున్నట్టుగా టైం ఫిక్స్ చేసింది టీం. రేపు సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. లూసిఫెర్ రీమేక్ టైటిల్ గా గాడ్ ఫాదర్ టైటిల్ ప్రచారం లో ఉండగా దాదాపుగా అదే ఫిక్స్ అంటున్నారు.
చిరు 154 మూవీని మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ చెయ్యబోతున్నాడు చిరు. చిరు 154 మూవీ కి టైటిల్ గా భోళా శంకర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ దసరాకి మొదలు కావొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఇక చిరు నెక్స్ట్ అంటే చిరు 155 ని బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసి.. చిరు కోసం బాబీ వెయిటింగ్ లో ఉన్నాడు. ఇక ఈ సినిమా కాంబోకి టైటిల్ గా వీరయ్య అనుకుంటున్నారట. మరి చిరు బర్త్ డే ఆగష్టు 22 న వీటికి సంబందించిన అప్ డేట్స్ వస్తాయేమో అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఆచార్య, చిరు 153 అప్ డేట్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. మిగతావి పెండింగ్ లో ఉన్నాయి.