Advertisementt

మెహర్ - చిరు అప్ డేట్ కూడా..

Sat 21st Aug 2021 09:32 AM
chiru 154,meher ramesh,chiranjeevi,megastar birthday,chiru - meher ramesh project  మెహర్ - చిరు అప్ డేట్ కూడా..
Interesting update on Chiru - Meher Ramesh combo మెహర్ - చిరు అప్ డేట్ కూడా..
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే హడావిడి మొదలైపోయింది. రేపు చిరు బర్త్ డే సందర్భంగా మెగా ఫాన్స్ రక్తదానాలు, కేక్ కటింగ్స్, బ్యానర్స్ హడావిడీ ఒక ఎత్తయితే.. చిరంజీవి నటిస్తున్న, నటించబోయే మూవీస్ అప్ డేట్స్ మరో ఎత్తు అనేలా ఉంది సోషల్ మీడియా హడావిడి. కొరటాలతో చిరు చేస్తున్న ఆచార్య రిలీజ్ డేట్ ఎనౌన్సమెంట్ రేపు చిరు పుట్టిన రోజు సందర్భంగా ఉండబోతుంది. మరోపక్క లూసిఫర్ రీమేక్ అంటే.. చిరు 153 అప్ డేట్ ఒక రోజు ముందే.. అంటే ఈ రోజు సాయంత్రమే రాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. 

ఇక చిరు - మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కబోతున్న తమిళ వేదాళం రీమేక్ అప్ డేట్ కూడా వచ్చెయ్యబోతుంది. రేపు ఉదయం 9 గంటలకి మెహర్ రమేష్ - చిరు కాంబో మూవీ అప్ డేట్ ఇవ్వబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఏకే ఎంటెర్టైన్మెంట్స్ లో రమేష్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీకి టైటిల్ గా భోళా శంకర ప్రచారంలో ఉండగా.. ఈ సినిమాలో చిరు కి సిస్టర్ గా కీర్తి సురేష్ నటించే అవకాశం ఉంది. ఇక మెహర్ రమేష్ అప్ డేట్ పై క్లారిటీ వచ్చెయ్యగా.. ఇప్పుడు దర్శకుడు బాబీ తో చిరు చెయ్యబోయే మూవీ అప్ డేట్ పై మెగా ఫాన్స్ లో క్యూరియాసిటీ మొదలైపోయింది. 

Interesting update on Chiru - Meher Ramesh combo:

Mega update on Meher Ramesh-Chiranjeevi project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ