ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజ హెగ్డే స్టార్ హీరోల సినిమాలతో ఇప్పటికి బిజీగానే ఉంది. పూజ హెగ్డే తెలుగు, తమిళ, హిందీ మూవీస్ తో క్షణం తీరిక లేకుండా గడపడమే కాదు.. సోషల్ మీడియాలో పూజ హెగ్డే షేర్ చేసే ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే. ఆ రేంజ్ గ్లామర్ తో అదరగొట్టేస్తుంది. అలాంటి టాప్ హీరోయిన్ పూజ హెగ్డే పై నటి, ఎమ్యెల్యే భర్త సెల్వమణి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడం కాదు.. పూజ హెగ్డే ఫాన్స్ కూడా ఫైర్ అవడం ఇప్పుడు సంచలనం గా మారింది.
పూజ హెగ్డే కెరీర్ కొత్తలో సినిమా షూటింగ్ లొకేషన్ కి తనతో పాటుగా ఓ అసిస్టెంట్ ని తీసుకుని వచ్చేది అని, పూజ హెగ్డే కి సంబందించిన మేకప్, హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ అన్ని అతనే చూసుకునేవాడని, కానీ ఇప్పుడు టాప్ హీరోయిన్ గా మారాక ఆమె తీరులో మార్పు వచ్చింది అని, అందులో భాగంగానే ఇప్పుడు లొకేషన్‌కు వచ్చేటప్పుడు ఏకంగా 12 మంది అసిస్టెంట్స్ ని ఆమె వెంట తెచ్చుకుంటుంది. అసలు 12 మంది అవసరం ఏముందో అర్థం కావడం లేదు. అలా ఎక్కువమంది అసిస్టెంట్స్‌ని వెంట తెచ్చుకోవడం వల్ల నిర్మాతలపై విపరీతంగా ఆర్థిక భారం పడుతోంది.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు పూజ హెగ్డే ఫాన్స్ సెల్వమణి పై ఫైర్ అవుతున్నారు.
నువ్వేమన్నా పూజ తో సినిమా చేస్తున్నావా.. పూజ హెగ్డే అసిస్టెంట్స్ ని ఎంతమంది ని తెచ్చుకుంటే.. నీకెందుకు అంటూ సెల్వమణి పూజ హెగ్డే ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు.