Advertisementt

మెగా సర్ప్రైజ్: చిరుకి రాఖి కట్టిన కీర్తి సురేష్

Sun 22nd Aug 2021 01:01 PM
mega surprise,keerthy suresh,chiranjeevi,chiru sister,bholaa shankar movie,keerty suresh - chiru,vedalam remake bhola shankar,chiru - maher ramesh combo  మెగా సర్ప్రైజ్: చిరుకి రాఖి కట్టిన కీర్తి సురేష్
Mega Surprise: Keerthy Suresh As Chiranjeevi Sister In Bholaa Shankar మెగా సర్ప్రైజ్: చిరుకి రాఖి కట్టిన కీర్తి సురేష్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ బర్త్ డే రోజున మెగా కాంపౌండ్ నుండి వచ్చే అప్ డేట్స్ తో మెగా ఫాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రామ్ చరణ్ తండ్రికి క్యూట్ గా ఆచార్య వర్కింగ్ వీడియో తో విష్ చెయ్యగా.. ఆచార్య నుండి పోస్టర్ సర్ప్రైజ్ ఇచ్చింది టీం. అంతేకాదు.. మెగాస్టార్ నెక్స్ట్ మూవీస్ టైటిల్స్, సర్ప్రైజెస్ తో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. చిరు - మోహన్ రాజా కాంబో లూసిఫెర్ రీమేక్ టైటిల్ గా గాడ్ ఫాదర్ ని రివీల్ చెయ్యగా.. నేడు చిరు పుట్టిన రోజు సందర్భంగా మెహర్ రమేష్ తో కలిసి తమిళ వేదాళం రీమేక్ చేస్తున్న చిరుకి ఆ సినిమా టైటిల్ తో విష్ చేసారు. 

మెహర్ రమేష్ - చిరు కాంబో టైటిల్ గా భోళా శంకర్ పెట్టగా.. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ తో పాటుగా.. నేడు రాఖి పండుగ సందర్భంగా చిరు చెల్లెలి కేరెక్టర్ ని రివీల్ చేసారు. వేదాళం రీమేక్.. భోళా శంకర్ అన్న చెల్లెళ్ళ అనుభందంతో తెరకెక్కుతున్న కథ కావడంతో చిరు చెల్లెలిని అఫీషియల్ గా రివీల్ చేసింది టీం. ముందు ప్రచారం జరిగినట్టుగా సాయి పల్లవి కాకుండా... ఈ సినిమాలో చిరు కి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నట్టుగా అధికారికంగా పోస్టర్ తో ప్రకటించారు. చిరంజీవికి కీర్తి సురేష్ రాఖి కడుతున్న పోస్టర్ ని రివీల్ చేసి మెగా సర్ప్రైజ్ చేసారు. మరి కీర్తి సురేష్ చిరు కి చెల్లిగా భోళా శంకర్ లో అఫీషియల్ గా కంఫర్మ్ అయ్యింది. 

Mega Surprise: Keerthy Suresh As Chiranjeevi Sister In Bholaa Shankar:

 Keerthy Suresh Ties Rakhi To Chiru Bholaa Shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ