ఒకప్పటి కూల్ హీరో ఇప్పుడు విలన్ అవతరమెత్తి అన్ని భాషల్లోనూ ఇరగదీస్తున్నాడు జగపతి బాబు. లెజెండ్ మూవీ తో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగపతి బాబు, క్రూరమైన విలన్ గాను, అలాగే స్టైలిష్ విలన్ గాను అద్భుతంగా నటిస్తున్నారు. ఇక కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. తమిళ, కన్నడ ఇలా ఏ భాషలో అయినా జగపతి బాబు కి మంచి విలన్ రోల్స్ పడుతున్నాయి. మరి ఇప్పుడు జగపతి బాబు ప్రభాస్ సినిమాలో విలన్ గా ఫిక్స్ అవడమే కాదు.. ఫస్ట్ లుక్ తో అదరగొట్టేసాడు. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న సలార్ మూవీలో జగపతి బాబు కీ రోల్ పోషిస్తున్న విషయాన్ని ఫస్ట్ లుక్ తో రివీల్ చేసారు సలార్ టీం.
రాజమానార్ లుక్ వదులుతున్నామంటూ నిన్నటినుండి సలార్ రాజమానార్ లుక్ పై ఆసక్తి పెంచిన టీం.. ఈ రోజు అనుకున్న టైం కి జగపతి బాబు రాజమానార్ లుక్ ని ఇంట్రడ్యూస్ చేసింది. జగపతి బాబు రాజమానార్ లుక్ లో ముక్కుకి పోగు పెట్టుకుని చాలా అంటే చాలా డిఫ్రెంట్ లుక్ లో మాస్ విలన్ గా అదరగొట్టేసాడు. రంగస్థలం, అరవింద సమేత సినిమాల్లో జగపతి బాబు లుక్స్ గుర్తు తెచ్చేలా ఉంది సలార్ లో జగపతి బాబు రాజమానార్ లుక్. జగపతి బాబు - ప్రభాస్ మధ్యన యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతుందేమో అంటూ ప్రభాస్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. సలార్ పాన్ ఇండియా ఫిలిం లో జగపతి బాబు రాజమానార్ గా అదరగొడుతున్న లుక్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.